కృగుశ్రీ కూతలు..
Л ۹ љ..њ Л ۹ љ..њ Л ۹ љ..њ ... ఇది నా మది మధన మనోగతం......
Sunday, February 28, 2010
శ్రీ....శ్రీ...శ్రీ ..ప్రణామం
Thursday, February 25, 2010
తస్మాత్ జాగ్రత్త " మొగవారికి మాత్రమే "
ప్రియురాలు ఒక కల ,
పెళ్ళాం దాని పై ఒక వల,
వదులు కోవడం ఎలా,
తెలిస్తే బ్రతుకు భళా...భళా
Tuesday, February 23, 2010
ఏమిటో ఇదంతా !
నేను....
పెళ్ళంటే నాకువళ్ళుమంట
కాదంటే ఇంట్లోఅదో రగడంట
చేసుకుంటే దానితోతంట
తప్పించుకోవడం ఎలాగంట ?
నేను కాని నేను...
మంటతోనే వస్తుందోగుంట
రగడలేకుండా చూసుకోమంట
తంటాకు తావులేదంట
విధినాపడం నీవల్లకాదంట!!
Friday, February 19, 2010
ఆ..ఆ .. ఏంటీ? నేనే !
క్షణమొక యుగముగ తలచిన ప్రియునకు
సఖిసుఖ సుమధుర పరిమళ శరములనే వదలంగా
జతపడి ముడిపడి కలబడి వడివడిగా సాగంగా
మదనుడి వదనము రతిముఖ అధరము మధురముకాగా...ఆ !
తడబడి నా వరవడి తెగిపడెనా..!!
నాపాట...నీనోట
మదిలోని భావాలు ,మనస్సులో రాగాలు
అంతరంగపు ఆవేశాలు, తలపులలో సత్యాలు,
కళ్ళలోగల కలలు, కలలో ఎన్నో హొయలు
రంగరించిన వచ్చునోపాట......రంజింపచేయవా నీనోట
Monday, February 15, 2010
ఎందరో మహనుభావులు...అందరికి వందనములు.
వాంగ్మయి చరణాలవిందములకు విద్యావిధాతస్వరనందనం
పద్మజాక్షి కరణాలవిందములకు వింజ్యామరహరిచందనం
జగన్మాత దివ్యారవిందములకు పారిజాతహారహరహృదయమందిరం
నా మాతృమూర్తికిదే నాభక్తిపూర్వకవందనం.. ప్రేమపూర్వకచుంబనం.
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)